జనగణన–2027 సన్నాహాలు వేగవంతం

by Muthe.Rajitha |

దేశంలో ఇదే మొదటి డిజిటల్ జనాభా లెక్కల సేకరణ అని సీఎస్ రామకృష్ణరావు పేర్కొన్నారు.

జనగణన–2027 సన్నాహాలు వేగవంతం
X

దిశ, తెలంగాణ బ్యూరో : డిజిటల్ విధానంలో జనగణన 2027 నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏ మురికివాడ, మారుమూల ప్రాంతాలలో కూడా జనగణన నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సూచించారు. మొత్తం ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేలా సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. సచివాలయంలో రాష్ట్ర స్థాయి సెన్సస్ సమన్వయ కమిటీ ( ఎస్ఎల్‌‌సీసీసీ) సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయి సంసిద్ధతలో భాగంగా కార్యాచరణ ప్రణాళిక గురించి అవగాహన కల్పించడానికి త్వరలో జిల్లా కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు. అన్ని విభాగాలు పూర్తి సహకారాన్ని అందించాలని తెలిపారు. ఈ ప్రక్రియకు అవసరమైన ఉద్యోగుల సంఖ్య తాత్కాలిక అంచనాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

2027 జనాభా గణన మైలురాయిని సూచిస్తుందని, మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా నిర్వహించబడుతుందని జనాభా గణన డైరెక్టర్ భారతి హోళికేరి కమిటీకి తెలియజేశారు. మొదటి దశలో సుమారు 90వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది గణనదారులుగా, పర్యవేక్షకులుగా నియమిస్తారని పేర్కోన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి నదీమ్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి పిఆర్ ఆర్డి ఎన్ శ్రీధర్, ఆరోగ్య ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జోంగ్తు, ప్రధాన కార్యదర్శి రెవెన్యూ లోకేష్ కుమార్, కార్యదర్శి జిఎడి ఇ శ్రీధర్, కార్యదర్శి ఎంఎయుడి టి కె శ్రీదేవి పాల్గొన్నారు.

Next Story