- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
19 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా తట్టుకుంటాం: విద్యుత్ శాఖ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం. 19 వేల మెగావాట్ల డిమాండ్‌కైనా అంతరాయం లేని సరఫరాకు నెట్‌వర్క్ సిద్ధం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి పంటల సీజన్‌తో పాటు వేసవి ప్రభావం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ (Electricity demand), వినియోగం గణనీయంగా పెరుగుతోందని... 19 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌నూ సమర్థంగా తట్టుకునే నెట్‌వర్క్ సిద్ధంగా ఉందని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. వేసవి డిమాండ్, యాసంగి సాగు సీజన్ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిఫ్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
గత ఏడాది మార్చి 20న నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లు కాగా... ఈ సంవత్సరం మార్చి 2న 17,606 మెగావాట్ల డిమాండ్‌ను చేరుకుని గత రికార్డును దాటిందని తెలిపారు. ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్... మార్చి 13న 18,228 మెగావాట్లకు చేరి, 341.08 మిలియన్ యూనిట్ల వినియోగం తో కొత్త రికార్డును సృష్టించిందన్నారు. డిమాండ్ భారీగా పెరిగినా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, ఓవర్‌లోడింగ్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ సంస్థలు సమర్థంగా వ్యవహరించాయని కితాబునిచ్చారు.
విద్యుత్ డిమాండ్ 19 వేల మెగావాట్లకు మించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త సబ్‌స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. యాసంగి పంటల సీజన్, వేసవి ముగిసేంత వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రైతాంగానికి, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని రంగాల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, డిస్కమ్‌ల సీఎండీలు ముషారఫ్ ఫరూఖీ, జితేష్ వి. పాటిల్, వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






