- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఎన్పీడీసీఎల్‌కు అంతర్జాతీయ స్థాయి అవార్డు
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును దక్కించుకుంది.

దిశ, హన్మకొండ టౌన్: నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును దక్కించుకుంది. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(IPPAI) వారు ప్రకటించిన 'ఇప్పాయి పవర్ అవార్డ్స్ 2026'లో ఎన్పీడీసీఎల్ ‘ఇన్నోవేషన్ అవార్డు’ను కైవసం చేసుకుంది. ఈనెల 10వ తేదీన కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన 26వ ‘రెగ్యులేటర్స్ & పాలసీమేకర్స్ రిట్రీట్’ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఈ (ప్రాజెక్ట్స్) సురేందర్ ఈ అవార్డును అందుకున్నారు. శుక్రవారం హన్మకొండ, నక్కలగుట్టలోని కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డికి సీఈ (ప్రాజెక్ట్స్) సురేందర్ ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్పీడీసీఎల్‌లో ప్రవేశపెట్టిన వినూత్న సాంకేతిక పద్ధతుల వల్లే ఈ అవార్డు దక్కిందని తెలిపారు.
ముఖ్యంగా :
AI రిస్క్ ప్రిడిక్షన్ మోడల్: కృత్రిమ మేధస్సు ద్వారా విద్యుత్ సరఫరాలో తలెత్తే ముప్పులను ముందుగానే పసిగట్టడం. రియల్-టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ (RTFMS): సంస్థలోని 17 సర్కిళ్లలో దీనిని ఏర్పాటు చేశామని, దీని ద్వారా ఫీడర్ల పనితీరును క్షణక్షణం పర్యవేక్షిస్తూ అంతరాయాలను వెంటనే సరిదిద్దుతున్నామని చెప్పారు. ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్స్ (FPIs): 33KV మరియు 11KV సుదూర లైన్లలో వీటిని అమర్చడం వల్ల, లైన్ మొత్తం వెతకాల్సిన అవసరం లేకుండా ఎక్కడ సమస్య ఉందో వెంటనే గుర్తించి విద్యుత్ పునరుద్ధరణ చేపడుతున్నామన్నారు. వినియోగదారుల చెంతకు విద్యుత్ సేవలు: వినియోగదారులతో నేరుగా సత్ సంబంధాలు మరింత మెరుగు పరుచుకోవడానికి ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి , మంగళ , బుధ శని వారాల్లో ప్రజా బాట, పొలం బాట కార్యక్రమాలు చేపడుతూ వినియోగదారుల్లో విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వివరిస్తూ చైత్యనం కల్పిస్తున్నామని ఈ సందర్బంగా వివరించారు.






