- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి ఆంధ్ర పోలీసుల దాష్టీకం.. పలువురు తెలంగాణ జర్నలిస్టుల అక్రమ అరెస్టులు
అర్ధరాత్రి వేళ ఆంధ్రప్రదేశ్ పోలీసులు పలువురు తెలంగాణకు చెందిన జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది.

దిశ, వెబ్ డెస్క్: అర్ధరాత్రి వేళ ఆంధ్రప్రదేశ్ పోలీసులు పలువురు తెలంగాణకు చెందిన జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. అరెస్టైన వారిలో కేవీ రెడ్డితో పాటు, స్వతంత్ర జర్నలిస్ట్ ప్రశ్న రావణ్ కూడా ఉన్నట్టు సమాచారం. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు సరైన సమాచారం అందించకుండా జర్నలిస్టులను వారి ఇళ్ల నుంచి బలవంతంగా లాక్కెళ్లినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేవీ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేస్తుండగా అడ్డుకున్న భార్యతో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపణలు వస్తున్నాయి. తన భర్తను ఏపీ పోలీసులు ఎత్తుకు వెళ్లారని ఆయన భార్య సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. అయితే జర్నలిస్టులు చేసిన వార్తలు, సోషల్ మీడియా పోస్టులు నేపథ్యంలోనే ఈ అరెస్టులు జరిగాయని ప్రచారం జరుగుతోంది.
అయితే పోలీసులు మాత్రం చట్టపరమైన కేసుల దర్యాప్తులో భాగంగానే అరెస్టులు చేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణలోని జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. TRS అధినేత్రి కల్వకుంట్ల కవిత జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను గౌరవించాలని, జర్నలిస్టులపై వేధింపులు ఆపాలని రాజకీయ నాయకులు, హక్కుల సంఘాలు కూడా కోరుతున్నాయి. ఈ ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది






