Telangana News: ట్రాఫిక్​ హోమ్ గార్డ్‌ను సత్కరించిన సీజే

by Disha Web Desk 19 |
Telangana News: ట్రాఫిక్​ హోమ్ గార్డ్‌ను సత్కరించిన సీజే
X

దిశ, డైనమిక్ బ్యూరో: త‌న విధుల‌ను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్ హోంగార్డ్‌కు ఊహించ‌ని స‌త్కారం ల‌భించింది. తెలంగాణ‌ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ సతీష్ చంద్ర శర్మ వాహనం వెళ్తుండగా ఒక్కసారిగా వాహనం నిలిపివేసి అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డు అష్రప్​అలీకి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఈ ఊహించ‌ని స‌న్మాన కార్యక్రమం అబిడ్స్‌లోని బాబు జ‌గ్జీవ‌న్ రామ్ విగ్రహం వ‌ద్ద శుక్రవారం ఉద‌యం ఆవిష్కృత‌మైంది. అబిడ్స్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న అష్రప్ అలీని గత కొన్ని నెలలుగా గమనించిన సీజే.. ఆయన నిబద్ధతను, క్రమశిక్షణను చూసి ఆకర్షితులయ్యారు. ఈ సందర్భంగా హోంగార్డును కలిసి సత్కరించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గురువారం విధుల్లోకి వెళ్లే సమయంలో కారును ఆపి అష్రప్ అలీకి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. హోంగార్డు పనితీరును సీజే గుర్తించి ఇలా సత్కరించడంపై పోలీసు ఉన్నతాధికారులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.





Next Story

Most Viewed