జనగణన జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

by Muthe.Rajitha |   (  Updated:2026-01-22 23:06:42  IST  )

తెలంగాణ ప్రభుత్వం జనగణన–2027కు సంబంధించి జీవో జారీ చేసింది.

జనగణన జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం జనగణన–2027కు సంబంధించి జీవో జారీ చేసింది. ఈ జనగణన దేశవ్యాప్తంగా రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇళ్ల వివరాలు, భవనాలు, నిర్మాణాలపై సమాచారం సేకరిస్తారు. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కలు మొదలుపెట్టి, మార్చ్ 1 అర్థరాత్రి వరకు పూర్తి కానుంది. ఈసారి జనగణనతోపాటు కుల గణనను కూడా చేయనున్నారు. మొత్తం ప్రక్రియ డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది.

ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో భాగంగా గ్రామాలు, మండలాలు, జిల్లాల సరిహద్దులను అప్‌డేట్ చేయడం, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకం, శిక్షణ వంటి సన్నాహాలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే జనగణన పూర్తయ్యే వరకు జిల్లాలు, నియోజకవర్గాల సరిహద్దుల్లో మార్పులు చేయరాదని స్పష్టం చేశారు. ఈ జనగణన తర్వాత లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉండటంతో ఈ ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

Next Story