- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉదయ్‌పూర్‌లో సత్తా చాటిన తెలంగాణ ఫైర్ సిబ్బంది
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన మొదటి ఆల్ ఇండియా ఫైర్ సర్వీస్ స్పోర్ట్స్ మీట్–2026లో రాష్ట్ర అగ్నిమాపక శాఖ సిబ్బంది సత్తా చాటారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన మొదటి ఆల్ ఇండియా ఫైర్ సర్వీస్ స్పోర్ట్స్ మీట్–2026లో రాష్ట్ర అగ్నిమాపక శాఖ సిబ్బంది సత్తా చాటారు. 19 మంది సభ్యులతో కూడిన తెలంగాణ బృందం ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొని మొత్తం మూడు పతకాలను కైవసం చేసుకుంది. అద్భుత ప్రదర్శన కనబరిచిన విజేతలను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ ప్రత్యేకంగా అభినందించారు. జనవరి 26 నుండి 31 వరకు ఉదయపూర్‌లోని మహారాణా ప్రతాప్ ఖేల్ గావ్ వేదికగా ఈ క్రీడలు జరిగాయి. ఇందులో వరంగల్ ఫైర్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచారు. అందులో వరంగల్ ఫైర్ స్టేషన్ కు చెందిన 40 ఏళ్ల పైబడిన విభాగంలో 5000 మీటర్లు, 1500 మీటర్ల పరుగు పందెంలో రెండు కాంస్య పతకాలు సాధించారు. వరంగల్ ఫైర్ స్టేషన్ కు చెందిన ఫైర్ ఫైటర్ టెక్నికల్ జి. కుమార స్వామి 30 ఏళ్ల పైబడిన విభాగంలో 5000 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం గెలుచుకున్నారు. వీరితో పాటు బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, షాట్‌పుట్, స్టెయిర్ రన్, లాంగ్ జంప్ వంటి పలు విభాగాల్లో తెలంగాణ సిబ్బంది గట్టి పోటీని ఇచ్చారు.
క్రీడలు ఆరోగ్యానికి చిహ్నం: డీజీ విక్రమ్ సింగ్ మాన్
విజేతలను సత్కరించిన సందర్భంగా డీజీ విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ ఈ విజయం రాష్ట్రానికే కాకుండా విభాగానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది తమ విధులతో పాటు శారీరక దృఢత్వం కోసం క్రీడలను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని ఆయన సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని, ఈ గెలుపు మిగిలిన సిబ్బందికి ప్రేరణగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.






