- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ.. అధికారిక ఉత్తర్వులు విడుదల
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈసారి రాజధాని హైదరాబాద్ (Hyderabad)కు దూరంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారం (Medaram)లో జరగనుంది. ఈ నెల 18న ఆదివారం సాయంత్రం 5 గంటలకు ములుగు జిల్లా, మేడారంలోని హరిత హోటల్ అందుకు వేదిక కానుంది. అయితే, సాధారణంగా సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశాన్ని ఈసారి గిరిజన ప్రాంతమైన మేడారంలో నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు (K Ramakrishna Rao) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, ఈ సమావేశంలో ప్రధానంగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్ర బడ్జెట్, మున్సిపల్ ఎన్నికలు, రైతు భరోసా వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కీలక భేటీకి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారులకు సమాచారం కూడా అందింది. మంత్రివర్గ భేటీకి సంబంధించి ములుగు జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీకి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.






