పసుపును ఉడికించిన తర్వాత.. 15 రోజులు ఎండబెట్టి అమ్మాలి

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో పసుపు కోతలు ప్రారంభం కావడంతో రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు చేసింది.

పసుపును ఉడికించిన తర్వాత.. 15 రోజులు ఎండబెట్టి అమ్మాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పసుపు కోతలు ప్రారంభం కావడంతో రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు చేసింది. పసుపును ఉడికించిన తరువాత కనీసం 15 రోజులు ఎండబెట్టిన మార్కెట్ యార్డులో అమ్మకం చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ తేమ 12 శాతం ఉంటే మద్దతు లభిస్తుందని తెలిపింది. మార్కెట్ యార్డు నిజామాబాద్‌లో పచ్చి పసుపు అమ్మకం పూర్తిగా నిషేదించడం జరిగింది. బాగా ఎండబెట్టిన పసుపును మాత్రమే మార్కెట్ యార్డుకు తీసుకరావాలని కోరింది. మార్కెట్ యార్డునకు వచ్చే ముందు పసుపును శుభ్రపర్చి, కాడి, గోల, చూరలను వేరుచేసి తెస్తే మంచి ధరలు లభిస్తుంది. యార్డులో ఏర్పాటుచేసిన ల్యాబ్‌ను వినియోగించుకొని తాము తెచ్చిన తేమ శాతం తెలుసుకోవాలని, పసుపు అమ్మిన తరువాత ఇ-నామ్ ద్వారా జారీచేసే అన్​లైన్​తక్ పట్టి తీసుకొని అదే రోజు రావాల్సిన నగదు తీసుకోవచ్చని పేర్కొంది.

Next Story