మహిళా IAS అధికారి మీద వార్తలు.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

మహిళా IAS అధికారి మీద వార్తా కథనాల వ్యవహారంపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేసారు.

మహిళా IAS అధికారి మీద వార్తలు.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల మహిళా IAS అధికారి మీద వార్తా కథనాలు ప్రసారం, అనంతరం జర్నలిస్టుల అరెస్టు చేసిన వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. మహిళా ఐఏఎస్ అధికారిపై ఎన్‌టీవీలో వచ్చిన డిఫమేటరీ వార్తల వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని, రాజకీయ లాభం కోసం ఆ పార్టీే ఈ వార్తలు చేయించిందని మల్లన్న హాట్ కామెంట్స్ చేసారు. కేటీఆర్‌, హరీశ్‌రావు ఎన్‌టీవీ అరెస్టులపై తీవ్రంగా స్పందించడం మీడియాపై ప్రేమతో కాదని, తమ తప్పులు, రహస్యాలు బయటపడతాయనే భయంతోనేనని డ్రామాలు ఆడారని అన్నారు. మహిళా ఐఏఎస్ అధికారిపై నిఘా పెట్టించి, ఆమె వ్యక్తిగత విషయాలను ఉపయోగించుకుని రాజకీయంగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

ఇది మహిళల గౌరవానికి భంగం కలిగించే విషయం అని, బీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలోనే మహిళా ఐఏఎస్ ఫిర్యాదు మేరకు ఎన్‌టీవీ జర్నలిస్టులపై పోలీసులు చర్యలు తీసుకోగా.. మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్‌ను తిరస్కరించి వారిని బెయిల్‌పై విడుదల చేయడం కూడా ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చిందని రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది.

Next Story