తీన్మార్ మల్లన్న పాదయాత్ర ప్రకటన

by Muthe.Rajitha |

తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న రాష్ట్రవ్యాప్తంగా భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.

తీన్మార్ మల్లన్న పాదయాత్ర ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న, రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేపారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ యాత్ర వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం బీసీలకు, వెనుకబడిన తరగతులు రాజ్యాధికారం కల్పించడమేనని అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మల్లన్న పార్టీ 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' (TRP) వర్గాలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. బీసీల సామాజిక న్యాయం, రాజకీయ హక్కులు, వారిని అధికారంలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఈ సుదీర్ఘ ప్రయాణం సాగనుంది.

ఈ పాదయాత్ర కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో వెనుకబడిన వర్గాల బలోపేతానికి ఒక వేదికగా నిలవనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రామగ్రామాన పర్యటించి, బీసీల సమస్యలను వినడమే కాకుండా, వారి రాజకీయ సాధికారతకు అవసరమైన మద్దతును కూడగట్టనున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైనందున, ఏ జిల్లా నుండి యాత్ర ప్రారంభమవుతుంది, ఏయే దశల్లో సాగుతుంది అనే వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Next Story