- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రత్యేక స్టార్టప్‌లకు కేంద్రంగానే ‘టీ హబ్’.. సీఎస్‌కు CM రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
టీ హబ్ లక్ష్యాన్ని నీరుగార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, దేశంలోనే ఆధునాతన ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా నిలిచిన కేంద్రాన్ని అద్దె భవనాల్లో కొనసాగుతోన్న ప్రభుత్వ కార్యాలయాలను అందులోకి షిఫ్ట్ చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాతో పాటు ప్రధాన పత్రికల్లో వార్త కథనాలు వస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: టీ-హబ్ లక్ష్యాన్ని నీరుగార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దేశంలోనే ఆధునాతన ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా నిలిచిన ఈ కేంద్రంలోకి అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను షిఫ్ట్ చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాతో పాటు ప్రధాన పత్రికల్లో వార్తా కథనాలుగా వచ్చాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. అయితే, ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో తాజాగా ఆ నిర్ణయంపై సర్కారు వెనక్కి తగ్గింది. ఈ మేరకు ప్రస్తుతం అమెరికా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ రామకృష్ణా రావుకు ఫోన్ చేసి కీలక ఆదేశాలు జారీ చేశారు. టీ-హబ్‌ను ప్రభుత్వ ఆఫీసుల కోసం వాడకూడదని ఆయన సీఎస్ రామకృష్ణా రావుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టీ-హబ్’ (T-Hub) కేవలం న్యూ ఇన్నోవేషన్స్, ప్రత్యేక స్టార్టప్‌లకు కేంద్రంగా మాత్రమే ఉండాలని సీఎస్‌కు దిశానిర్దేశం చేశారు. టీ-హబ్ అనేది ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన స్టార్టప్ హబ్ అని, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వల్ల దాని ప్రాధాన్యత, పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఆ ప్రాంగణం పూర్తిగా వారి కార్యకలాపాలకే కేటాయించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1000 కోట్ల స్టార్టప్ ఫండ్‌ను ప్రకటించింది. 2034 నాటికి హైదరాబాద్ నుంచి కనీసం 100 యూనికార్న్ కంపెనీలు రావాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోంది.






