హైరైజ్డ్ బిల్డింగ్స్‌కు కూడా టీడీఆర్.. 10 ఫ్లోర్లు మించితే కంపల్సరీ

by Kema Shiva Kumar |

చెరువులు, నదులు, నాలాల పరిరక్షణతో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ఎంటీఎల్ పరిధిలోని నిర్మాణాలకు టీడీఆర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

హైరైజ్డ్ బిల్డింగ్స్‌కు కూడా టీడీఆర్.. 10 ఫ్లోర్లు మించితే కంపల్సరీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువులు, నదులు, నాలాల పరిరక్షణతో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ఎంటీఎల్ పరిధిలోని నిర్మాణాలకు టీడీఆర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో హైరైజ్డ్ భవంతుల నిర్మాణంలో కీలక మార్పులు చేసింది. 10 అంతస్తులకు మించడంతో పాటు బిల్టప్ ఏరియాలో 10 శాతం తప్పనిసరిగా ట్రాన్సఫర్ ఆఫ్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్)ను వినియోగించాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టీడీఆర్ ధరలకు రెక్కలొచ్చాయి. టీడీఆర్ యజమానులకు సైతం డిమాండ్ భారీగా పెరిగింది. ఫలితంగా బిల్డర్లు, డెవలపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో టీడీఆర్ రేట్లు మండిపోతున్నాయని, ఈ తరుణంలో టీడీఆర్ తప్పనిసరిగా చేయడంతో ప్రాజెక్టులు చేపట్టలేమని పలువురు బిల్డర్లు వాపోతున్నారు.

లక్ష చ.అ.కు రూ.247 కోట్లు!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓ బిల్డర్‌కు లక్ష చదరపు అడుగుల టీడీఆర్ అవసరం ఉంది. సదరు బిల్డర్ ఓ టీడీఆర్ యజమానిని సంప్రదిస్తే టీడీఆర్ రేషియో 55 శాతం నడుస్తోందని, ఆలస్యం చేస్తే మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. టీడీఆర్ చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ)కి రూ.45 వేలు ఉంది. ఈ చొప్పున లక్ష ఎస్ఎఫ్టీకి రూ.450 కోట్లు అవుతోంది. దీనిలో 55 శాతం రేషియో అంటే రూ.247 కోట్లు చెల్లించి టీడీఆర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంత రేట్లు పెట్టి టీడీఆర్ కొనుగోలు చేసి హైరైజ్డ్ బిల్డింగ్స్ పూర్తిచేసినా ఆశించిన కొనుగోళ్లు లేవని పలువురు బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రేటు పెడితే హైదరాబాద్‌లో రెండెకరాల భూమిని కొనుగోలు చేయడానికి అవకాశముందని పలువురు డెవలపర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డెవలపర్లు గగ్గోలు..

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలో సుమారు 200లకుపై గా హైరైజ్డ్ బిల్డింగ్స్‌కు జీహెచ్ఎంసీ, హెచ్ ఎండీఏ అధికారులు అనుమతులు జారీచేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2025 లో 103 హైరైజ్డ్ బిల్డింగ్స్‌కు జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. హెచ్ఎండీఏ పరిధిలో నూ సుమారు 100 వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. హైరైజ్డ్ బిల్డింగ్స్ అంటే 10 అంతస్తుల జమానా ఎప్పుడో పో యింది. హైరైజ్డ్ బిల్డింగ్స్ అంటేనే 20 అంత స్తుల నుంచి 70 అంతస్తుల వరకు ఉన్నా యి. మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంప ల్లి, కోకాపేట, నార్సింగి, గండిపేట్, బండ్ల గూడ జాగీర్, కూకట్‌పల్లి, ఆల్వాల్, మేడ్చ ల్, ఘట్‌కేసర్, మోకిలా, శంకర్‌పల్లి ప్రాం తాల్లో హైరైజ్డ్ బిల్డింగ్స్ ఎక్కువగా నిర్మిస్తున్నారు. కొనుగోళ్లు తగ్గాయని డెవలపర్లు చె బుతున్నారు. టీడీఆర్ తప్పనిసరి చేయడం తో బిల్డర్లపై అదనపు భారం తప్ప మరొకటి కాదని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

భారీగా డిమాండ్..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎస్ఆర్డీపీ లో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణంలో ఆస్తులు కోల్పోయినవారికి గత ప్రభుత్వం టీడీఆర్ రూపంలో పరిహారం చెల్లించింది. రెండేళ్ల క్రితం టీడీఆర్ 20 శాతానికి ఎవరు కొనుగోలు చేసేవారు కాదు. కానీ ఏడాది కాలంగా టీడీఆర్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో ఒక్కసారిగా 50 నుంచి 55 శాతానికి పెరిగిపోయింది. దీంతో టీడీఆర్ కొనుగోలు చేయాలంటేనే బిల్డర్లు, డెవలపర్లు బెంబేలెత్తుతున్నారు. అయితే ఈ నెల 16న ప్రభుత్వం టీడీఆర్ జారీచేసే మార్గదర్శకాలతో కూడిన జీవో ఎంఎస్ నెం.16 ఇచ్చింది. అయితే చెరువులు, నాలాలు, నదుల్లోని ఆస్తులు, భూములను గుర్తించి టీడీఆర్ ఇవ్వడానికి ఆరునెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అప్పుడైనా టీడీఆర్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుందేమో వేచి చూడాల్సిందే.

Next Story