- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ మహానాడు వేదిక, తేదీలు ఫిక్స్
టీడీపీ మహానాడుకు నెల్లూరు వేదికగా ఖరారైంది. ఈ నెల 27 నుండి 29 వరకు మూడు రోజుల పాటు ఇఫ్కో కిసాన్ సెజ్ భూముల్లో ఈ సభలు జరగనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షికోత్సవ సభ 'మహానాడు'(Mahanadu) వేదిక ఎట్టకేలకు ఖరారైంది. నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ సెజ్ (IFFCO Kisan SEZ) భూములలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, కీలక నాయకులు ఈ సభకు హాజరు కానున్నారు. రాబోయే రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఈ వేదికగా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
వాస్తవానికి ఈ మహానాడు సభలను గతంలోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చాయి. వివిధ రాజకీయ సమీకరణాలు, ఇతర సాంకేతిక కారణాలతో వాయిదా పడిన ఈ సభలను, ఇప్పుడు నెల్లూరు వేదికగా పక్కా ప్రణాళికతో నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేదిక ఖరారు కావడంతో నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మహానాడు ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని నాయకత్వం భావిస్తోంది.






