- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ నేత ప్రభాకర్ కిడ్నాప్ - వైసీపీ నేతలపై అనుమానాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేతను దుండగులు కిడ్నాప్ చేయడం కలకలం గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేతను దుండగులు కిడ్నాప్ (Kidnapping) చేయడం కలకలం గా మారింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ నేత ప్రభాకర్ (TDP leader Prabhakar) దుండగులు కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా సంచలనం సృష్టించింది. గుర్తు తెలియని దుండగులు ఆయనను కిడ్నాప్ చేసి, రాత్రి సమయంలో వదిలిపెట్టి వెళ్లారు. ప్రస్తుతం ప్రభాకర్ గుడివాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభాకర్ గతంలో మాజీ మంత్రి కొడాలి నాని (Former Minister Kodali Nani) పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన కిడ్నాప్ వెనుక వైసీపీ నేతల ప్రమేయం (Involvement of YCP leaders) ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత కక్షలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. దీనిపై ప్రభాకర్ కుమార్తె గుడివాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






