AP News: జగన్‌కు ఊహించని షాక్ ఇవ్వబోతున్న చంద్రబాబు.. ఒకే వేదిక‌పై పవన్, ఎన్టీఆర్?

by Disha Web Desk 2 |
AP News: జగన్‌కు ఊహించని షాక్ ఇవ్వబోతున్న చంద్రబాబు.. ఒకే వేదిక‌పై పవన్, ఎన్టీఆర్?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా రోజులున్నప్పటికీ ఎన్నికల మూడ్ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధికార, విపక్షాలు అన్నీ ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఇక స్థానిక నేతలు సైతం.. బెర్త్ ఖరారు అయ్యేలా కర్చీప్ వేసుకునే ప్రయత్నాలు చేస్తుంటే.. కొన్నిచోట్ల వర్గ విభేధాలు సైతం బయటపడుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికలకు ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడిన మాటలు అందుకు ఆజ్యం పోస్తున్నాయి. ''వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వం. కలిసి వచ్చే అన్ని పార్టీలతో పొత్తు గురించి ఆలోచిస్తాం'' అని ప్రకటనతో ఏపీలో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం దూకుడు తగ్గించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. జగన్‌‌లో గతంలో ఉన్నంత స్పీడ్ ప్రస్తుతం ఆయనలో కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపి ప్రచారం చేయించాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న టీడీపీ పరిస్థితి చూస్తుంటే యంగ్ టైగర్ ఎంట్రీ ఖాయమని పార్టీ శ్రేణులు బహిరంగంగానే అధినేతతో చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతి ఓటు, ప్రతి వ్యక్తి ముఖ్యమని చంద్రబాబు సైతం ఇప్పటికే టీడీపీ క్యాడ‌ర్‌కు దిశానిర్దేశం చేశారని, ఎన్టీఆర్ ఇమేజ్‌ను పార్టీకి అనుకూలంగా మ‌లుచుకుంటే టీడీపీకి తిరుగుండ‌ద‌ని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత ప‌రిస్థితుల్లో బీజేపీని దూరంగా పెట్టి, మళ్లీ జనసేతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ఫలితాలతో చూస్తే, ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన పార్టీ భారీగానే పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనతో పాటు కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌లతో క‌లిసి కూట‌మిగా ఏర్పడి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. కూట‌మి ఏర్పాటుతో పవన్ కల్యాణ్ క్రేజ్, జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్‌తో మెజార్టీ అందుకోచ్చని భావిస్తున్నారు. వీలైతే పవన్, ఎన్టీఆర్‌‌ను ఒకే వేదికమీదకు తెచ్చేలా భారీ బహిరంగ సభ సైతం ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి కూటమి ఏర్పాటు, పవన్, ఎన్టీఆర్ కలయిక ఉంటుందో లేదో వేచి చూడాలి.

Next Story

Most Viewed