- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారికి టీడీపీ బుజ్జగింపులు. ఫోన్ చేసి వివరణ
రాజ్యసభ సీటు దక్కని టీడీపీ ఆశావహులకు అధిష్టానం బుజ్జగింపులు.సామాజిక సమీకరణాల వల్లే అభ్యర్థుల ఎంపిక జరిగిందని వివరణ.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజ్యసభ సభ్యులు ప్రకటన తర్వాత.. టీడీపీ పార్టీ అంతర్గత పరిణామాలపై దృష్టి సారించింది. ఎంతో కాలంగా పార్టీలో ఉంటూ.. రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన నేతలు పార్టీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్రమత్తం అయిన టీడీపీ సీనియర్ నేతలు.. రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన సీనియర్ ఆశావహులను బుజ్జగించే ప్రక్రియను పార్టీ వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు కీలక నేతలు రంగంలోకి దిగి అసంతృప్త నాయకులతో చర్చలు జరుపుతున్నారు.
రాజ్యసభ అవకాశం దక్కని సీనియర్ నేతలు వర్ల రామయ్య, తిప్పేస్వామిలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ పట్ల వారికున్న నిబద్ధతను గుర్తు చేస్తూనే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సామాజిక సమీకరణాల (Social Equations) ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగిందని వారికి స్పష్టమైన వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో పార్టీ పరంగా తగిన ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు, రాజ్యసభ రేసులో నిలిచిన ఇతర ప్రముఖ ఆశావహులైన కంభంపాటి రామ్మోహన్ రావు, రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి తో టీడీపీ నేత కిలారు రాజేష్ ఫోన్ చేసి మాట్లాడారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ తీసుకున్న నిర్ణయానికి గల కారణాలను వారికి వివరించారు.






