- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ న్యూస్ చెప్పిన తరుణ్ భాస్కర్.. ఈషాతో పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో, నటి ఈషా రెబ్బా (Eesha Rebba) పెళ్లి.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tarun Bhaskar), నటి ఈషా రెబ్బా (Eesha Rebba)త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరి కలయికలో రాబోతున్న ‘ఓం శాంతి శాంతి శాంతి’ (Om Shanti Shanti Shanti)మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండే వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న తరుణ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈషాతో తన బంధం గురించి తరుణ్ స్పందిస్తూ.. తను తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే కాదని, అంతకు మించిన ప్రత్యేకమైన వ్యక్తి అని పేర్కొన్నారు.
గత కొంతకాలంగా తన ప్రయాణంలో ఈషా ఎంతో సపోర్ట్‌గా నిలుస్తోందని వెల్లడించారు. ఇది పర్సనల్ విషయం కాబట్టి ఏది మాట్లాడినా అవతలి వ్యక్తిపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని, అందుకే ఆచితూచి స్పందిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం తన మనసులో ఉన్న విషయాన్ని దాచడానికి ఏమీ లేదని, పర్సనల్ విషయం కాబట్టి సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు తరుణ్ భాస్కర్ స్పష్టం చేశారు. త్వరలోనే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడతానని, దేవుడి దయ ఉంటే అన్నీ సవ్యంగా జరుగుతాయని ఆయన అనడంతో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






