Taraka ratna: ఎట్టకేలకు గుడ్ న్యూస్ అనౌన్స్ చేసిన తారకరత్న భార్య.. పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2024-10-24 15:51:15  IST  )

గత ఏడాది ఫిబ్రవరిలో టాలీవుడ్ హీరో తారకరత్న(Tarakaratna)కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన విషయం తెలిసిందే.

Taraka ratna: ఎట్టకేలకు గుడ్ న్యూస్ అనౌన్స్ చేసిన తారకరత్న భార్య.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: గత ఏడాది ఫిబ్రవరిలో టాలీవుడ్ హీరో తారకరత్న(Tarakaratna)కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాదయాత్రలో భాగంగా ఈ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అయితే తారకరత్న మరణం తర్వాత నుంచి ఆయన భార్య అలేఖ్య రెడ్డి (Alekhya Reddy)సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తారకరత్నను తలుచుకుని పలు పోస్టులు షేర్ చేస్తుంది. అలాగే తన పిల్లలకు సంబంధించిన విషయాలు తెలుపుతోంది. ఎవరైనా ఏమైనా అంటే కూడా వారికి కట్టి సమాధానమిస్తూ పోస్టులు పెడుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి (Alekhya Reddy)ఇన్‌స్టా వేదికగా గుడ్ న్యూస్ అనౌన్స్ చేసింది.

నేడు తన పెద్ద కూతురు నిష్క(Nishka) హాఫ్ శారీ ఫంక్షన్ అయిందంటూ ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. అయితే ఈ ఫంక్షన్‌లో తారకరత్న ఫొటో పెట్టి ఆయనకు నివాళులు కూడా అర్పించి క్యార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) పెదనాన్న వైసీపీ నేత విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy)తో పాటు పలువురు బంధువులు, మిత్రులు పాల్గొన్నారు. కానీ ఈ వేడుకకు నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వారంతా దూరంగా ఉన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వారిని పిలవలేదా.. లేక రాలేదా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ నిష్మ హాఫ్ శారీ ఫంక్షన్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story