- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాతీర్పులో ఏడోసారి కూడా పరాభవం.. తమిళిసై రాజకీయ భవిష్యత్తుపై సందిగ్ధం!
తమిళనాడు ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్‌కు వరుసగా ఏడోసారి ఓటమి తప్పడం లేదు. మైలాపూర్ నియోజకవర్గంలో ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ గవర్నర్‌గా భాద్యతలు నిర్వహించి తమిళసై సౌందర్ రాజన్ (Tamil Sai Soundararajan)కు మరోసారి ఓటమి తప్పలేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు తమిళిసై మరోసారి నిరాశే ఎదురైంది. మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె, తాజా కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం మూడో స్థానానికి పరిమితమయ్యారు. అక్కడ తమిళగ వెట్రి కళగం (TVK), డీఎంకే అభ్యర్థులు మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండటంతో, తమిళిసై విజయావకాశాలు పూర్తిగా మసకబారాయి. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసైకి, ఈ ఫలితం కోలుకోలేని దెబ్బ గా మారింది. ఇప్పటివరకు ఆమె లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా, ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. తాజా ఫలితంతో కలిపి ఆమె వరుసగా ఏడోసారి ఓటమిని చవిచూడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష ఎన్నికల్లో అదృష్టం కలిసిరాకపోవడంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి.






