చిక్కుల్లో దళపతి విజయ్‌ సినిమా.. రంగంలోకి తమిళనాడు CM స్టాలిన్

by Gantepaka Srikanth |

సెన్సార్ బోర్డుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సీరియస్ అయ్యారు.

చిక్కుల్లో దళపతి విజయ్‌ సినిమా.. రంగంలోకి తమిళనాడు CM స్టాలిన్
X

దిశ, వెబ్‌డెస్క్: సెన్సార్ బోర్డుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Tamil Nadu Chief Minister MK Stalin) సీరియస్ అయ్యారు. దళపతి విజయ్(Thalapathy Vijay) ప్రధాన పాత్రలో నటిస్తున్న జన నాయగన్ చిత్రాన్ని అడ్డుకోవడంపై స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ తర్వాత ఇప్పుడు సెన్సార్ బోర్డ్ కూడా బీజేపీ చేతిలో ఆయుధంలా మారిందని మండిపడ్డారు. మరోవైపు.. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సెన్సార్‌ బోర్డును మద్రాసు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులతో విజయ్ అభిమానులతో సహా, చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. అనంతరం సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఎఫ్‌సీ మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. విజయ్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్దే, మమితా బైజు, ప్రకాశ్ రాజ్‌ తదితరులు కీలక పాత్ర పోషించారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించారు.

Next Story