- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. రేపే 17వ శాసనసభ తొలి సమావేశం
టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టగా, రేపు ఉదయం 9:30 గంటలకు 17వ తమిళనాడు శాసనసభ మొదటిసారి భేటీ కానుంది.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాలు వేగంగా మలుపు తిరుగుతున్నాయి. నేడు టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టగా, రేపు ఉదయం 9:30 గంటలకు 17వ తమిళనాడు శాసనసభ మొదటిసారి భేటీ కానుంది. చెన్నైలోని చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్ వేదికగా ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. రేపటి సమావేశంలో ప్రధానంగా కొత్తగా ఎన్నికైన 234 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రభుత్వం ఇప్పటికే నియమించిన ప్రో-టెం స్పీకర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఎమ్మెల్యేలందరూ వరుసగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
విజయ్ సర్కార్‌కు 'ఫ్లోర్ టెస్ట్' ఎప్పుడు?
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, తన బలాన్ని నిరూపించుకోవడానికి అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ఎప్పుడు ఎదుర్కొంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే లేదా ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ ఉండవచ్చని సమాచారం. కాగా తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువుదీరుతుండటం, సూపర్ స్టార్ విజయ్ తొలిసారి ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా సభలోకి అడుగుపెడుతుండటంతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు అసెంబ్లీ పరిసరాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.






