అభిమానులపై విజయ్ సీరియస్.. హద్దుమీరొద్దంటూ..

by Dishanational2 |
అభిమానులపై విజయ్ సీరియస్.. హద్దుమీరొద్దంటూ..
X

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'బీస్ట్. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌తో పాటు ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇదిలా ఉంటే.. ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న చిత్రానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. చిత్ర ట్రైలర్‌లో కొన్ని సన్నివేశాలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, రిలీజ్‌ ఆపాలని పలు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అరబ్ దేశాల్లో 'బీస్ట్‌' సినిమాపై ఇప్పటికే నిషేధం విధించడంతో ఇష్యూ మరింత సీరియస్‌గా మారింది. మరోవైపు తమ అభిమాన హీరో సినిమాను అడ్డుకుంటే ఊరుకోబోమంటూ విజయ్ ఫ్యాన్స్ సోషల్‌ మీడియా వేదికగా అసభ్యకర ట్రోల్స్‌, మీమ్స్‌ పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పోస్టులపై స్పందించిన విజయ్.. ష్యాన్స్‌పై సీరియస్ అయ్యాడు. ఎవరూ హద్దు మీరొద్దని.. నేతలు, సినీ ప్రముఖులు, మత సంబంధ సంఘాలపై ట్రోల్స్‌ చేస్తే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.



Next Story

Most Viewed