ఐపిఎల్ 2022 టోర్నమెంట్‌కు జతకట్టిన Swiggy

by Harish |

దిశ,వెబ్‌డెస్క్: టాటా ఐపిఎల్ 2022 టోర్నమెంట్‌కు Swiggy Instamart అధికారిక..telugu latest news

ఐపిఎల్ 2022 టోర్నమెంట్‌కు జతకట్టిన Swiggy
X

దిశ,వెబ్‌డెస్క్: టాటా ఐపిఎల్ 2022 టోర్నమెంట్‌కు Swiggy Instamart అధికారిక భాగస్వామిగా ఉంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) శుక్రవారం ప్రకటించింది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మే 29 వరకు జరగనుంది. "ఐపిఎల్ 2022 అధికారిక భాగస్వామిగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లోకి ప్రవేశించడం సంతోషంగా ఉందని" టాటా ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. "ఐపిఎల్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ స్పోర్ట్స్ లీగ్‌లలో ఒకటి, Swiggy Instamart దీంతో జతకట్టడం ద్వారా పానీయాలు, ఇతర అల్పాహారాలను ప్రేక్షకులకు అందించవచ్చు. BCCI తో భాగస్వామిగా ఉండటానికి సంతోషిస్తున్నామని" స్విగ్గీ బ్రాండ్ హెడ్ ఆశిష్ లింగంనేని అన్నారు.

Next Story