అత్తారింట్లో 'కజ్జికాయ' రగడ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్న అల్లుడు!

by Malleboina Mahesh |

అనంతపురం జిల్లా ఉరవకొండలో అత్తగారింటికి వెళ్లిన అల్లుడికి కజ్జికాయలు వడ్డించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుల్ వచ్చి కజ్జికాయలు పంచడంతో వివాదం ముగిసింది.

అత్తారింట్లో కజ్జికాయ రగడ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్న అల్లుడు!
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్తగారింటికి వెళ్లిన ఓ అల్లుడు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అల్లుళ్ళు తమ అత్తగారింటికి వెళ్లారు. మర్యాదల్లో భాగంగా అత్తింటి వారు మొదటి ఇద్దరు అల్లుళ్లకు కజ్జికాయలు వడ్డించారు. అయితే, మూడవ అల్లుడికి మాత్రం కజ్జికాయలు పెట్టకపోవడంతో ఆయన తీవ్ర అవమానంగా భావించాడు. వెంటనే "ఇద్దరు అల్లుళ్లకు ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేదు? ఇదేం మర్యాద?" అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన చిన్న అల్లుడు.. ఏకంగా డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విచిత్ర సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటు చేసుకుంది. చిన్న అల్లుడి నుంచి వచ్చిన ఈ విచిత్ర ఫిర్యాదుతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్, అక్కడ ఉన్న ముగ్గురు అల్లుళ్లకు స్వయంగా కజ్జికాయలను పంపిణీ చేసి గొడవను సద్దుమణిగించారు. అల్లుడి అలక తీరడం, పోలీసులు స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఈ 'కజ్జికాయ వివాదం' సుఖాంతమైంది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో, "కజ్జికాయ కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడమా?" అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story