అన్యాయం జరిగింది. సాయం చేయగలరా.. నటి ట్వీట్ వైరల్

by Dishafeatures2 |
అన్యాయం జరిగింది. సాయం చేయగలరా.. నటి ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌కు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైనట్లు తెలిపింది. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ కోసం అమెరికాలోని లాస్‌ ఎంజెల్స్‌లో స్టే చేస్తున్నట్లు చెప్పిన నటి.. అక్కడొక క్యాబ్ డ్రైవర్ తన వస్తువులను దొంగిలించాడంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు షూటింగ్‌ విరామ సమయంలో షాపింగ్‌కి వెళ్లి తిరిగి వచ్చేందుకు ఊబర్‌లో క్యాబ్‌ బుక్ చేసుకున్నానని, దారిలో మరో వస్తువు కోనేందుకు కారును ఆపి తిరిగి వచ్చేలోపు వస్తువులతో పాటు కారు డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది.

అయితే తనకు జరిగిన అన్యాయం గురించి ఊబర్ కంపెనీకి ట్వీట్ చేసిన స్వర.. 'హే ఊబర్ సపోర్టు.. లాస్ ఎంజెల్స్‌లో మీ డ్రైవర్ ఒకడు నా వస్తువులను తీసుకొని వెళ్లిపోయాడు. నేను పొగొట్టుకోలేదు. అతడే దొంగిలించాడు. దీని గురించి మీ యాప్‌లో కంప్లైంట్ చేయడమెలాగో తెలియలేదు. నా వస్తువులని తిరిగి పొందే అవకాశం ఉందా?' అంటూ రాసుకొచ్చింది. దీంతో వెంటనే రిప్లై ఇచ్చిన ఊబర్ సపోర్ట్ టీం.. అసలేం జరిగిందో తెలుసుకుని మీకు తప్పకుండా సాయం చేస్తామని స్పష్టం చేసింది.



Next Story

Most Viewed