- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్‌పల్లిలో వ్యక్తి అనుమానస్పద మృతి.. హత్యనా? ప్రమాదమా?
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం వెల్లుల్ల రోడ్ అభయస్థాన్ హనుమాన్ దేవాలయం సమీపంలో ఓ వ్యక్తి శనివారం రాత్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది.

దిశ, మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం వెల్లుల్ల రోడ్ అభయస్థాన్ హనుమాన్ దేవాలయం సమీపంలో ఓ వ్యక్తి శనివారం రాత్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వెల్లుల్ల రోడ్ అభయస్థాన్ హనుమాన్ దేవాలయం సమీప దగ్గరలో ఓ ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి చనిపోయి రక్తం మడుగులో ఉన్నది గమనించిన స్థానికులు, మెట్ పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడని ఎవరైనా బలంగా కొట్టి హత్య చేశారా? లేదా కాలు జారీ పడి ప్రమాదంలో చనిపోయాడా? అనే కోణంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటన పై ఎస్సై కిరణ్ కుమార్ వివరణ కోరగా.. మృతుడు కాలు జారీ పడి చనిపోయినట్లుగా ఉందని, కుటుంబీకులు ఇప్పటివరకు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని పోస్ట్ మార్టం రిపోర్ట్ నివేదన ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.






