- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
బడ్జెట్ చర్చకు అడ్డుపడుతున్నారన్న కారణంతో తెలంగాణ అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెండు రోజుల పాటు సస్పెండ్. సభలో తీవ్ర గందరగోళం.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలపై సభా కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ.. ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే తీరు ఆటంకంగా మారింది. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యులు తీరు మార్చుకొని బిల్లుల చర్చకు సహకరించాలని లేదంటే సస్పెన్షన్ ఎదుర్కొవాలని సూచించారు. అయినప్పటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పీకర్ పోడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు.
దీంతో అప్రమత్తం అయిన మార్షల్స్ బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. దాదాపు అర్ధగంట ఇదే పరిస్థితి కొనసాగగా.. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ సభ్యులను రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాధించారు. దీంతో బడ్జెట్ పై చర్చకు అడ్డు పడుతున్నందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు.






