Surya: మీడియాను క్షమాపణలు కోరిన సూర్య.. కారణమిదే..?

by Kodari Anjali |

ప్రముఖ హీరో సూర్య(Surya) నటించిన కంగువా- 2 (Kaṅguvā 2) చిత్రం కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Surya: మీడియాను క్షమాపణలు కోరిన సూర్య.. కారణమిదే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హీరో సూర్య(Surya) నటించిన కంగువా- 2 (Kaṅguvā 2) చిత్రం కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నవంబరు 14 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించగా.. ఈ సమావేశానికి హీరో సూర్య గంట లేట్ గా వచ్చాడు. దీంతో సూర్య మీడియా వారిని క్షమాపణలు కోరాడు. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండని అడిగాడు. ట్రాఫిక్ కారణంగా లేట్ అయిందని సాకులు చెప్పనని అన్నాడు. మీడియా వారికి నేను విలువనిస్తానిచ్చానని.. కానీ నేను దీన్ని నేను నియంత్రించలేకపోయానని తెలిపాడు.

అనంతరం కంగువా -2 సినిమా గురించి మాట్లాడారు. కంగువా ఫస్ట్ పార్ట్ క్లైమాకస్ లో కాస్త అర్థం కాలేదు.. దానిపై చాలా ప్రశ్నలున్నాయని చాలా మంది అన్నారు. దానికి ఇప్పుడు వచ్చే రెండో భాగంలో సమాధానాలు ఉన్నాయని సూర్య వెల్లడించాడు. సినీ ప్రేక్షకులతో పాటు కంగువా-2 కోసం తను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని అన్నాడు. ఇక ఈ హీరో నెక్ట్స్ సినిమాకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. కంగ అనే ఓ పరాక్రముడి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో సూర్య ఆరు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడట. ఇందులో దిశా పటానీ(Disha Patani) హీరోయిన్ గా నటించగా.. బాబీ దేవోల్(Bābī dēvōl) విలన్‌గా, యోగిబాబు(Yogi Babu), జగపతి బాబు(Jagapathi Babu), కోవై సరళ(Kovai Sarala) పలువురు ముఖ్య పాత్రలో మెరవనున్నారు.

Next Story