- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరిశుభ్రతపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం: టీఎస్ యూటీఎఫ్
నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు అని, అది జీవించే హక్కు, విద్యాహక్కులో భాగమని సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మకతీర్పు పట్ల టియస్‌యుటిఎఫ్ హర్షం వ్యక్తం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు అని, అది జీవించే హక్కు, విద్యాహక్కులో భాగమని సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మకతీర్పు పట్ల టియస్‌యుటిఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతూ టియస్‌యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చావరవి, ఎ. వెంకట్, ఉపాధ్యక్షులు సిహెచ్ దుర్గ భవాని, మహిళా విభాగం కన్వీనర్ ఆర్. శారదలు శనివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని సుప్రీంకోర్టు తీర్పు తేటతెల్లం చేసిందన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక బాలికలు తగిన మోతాదులో నీళ్లు కూడా తాగడం లేదని, ఫలితంగా ఋతుస్రావం సమయంలోనే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
అలాగే విద్యారంగం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామనే మాటలు కేవలం ప్రకటనలు కేటాయింపుల వరకేనని, నేటికి అనేక పాఠశాలల్లో బాల బాలికలకు ప్రత్యేక మరుగుదోడ్లు లేకపోవడం అంటే ప్రభుత్వాలకు అధికార యంత్రాంగానికి విద్యార్థుల ఆరోగ్య, పరిశుభ్రత పట్ల శ్రద్ధ లేకపోవడమే కారణమని, కానీ నేడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఆర్టికల్ 21, 21(ఎ) ప్రకారం తీర్పునివ్వడం ద్వారా ప్రభుత్వాలను బాధ్యులను చేసింది.
టియస్‌యుటిఎఫ్‌గా గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు ఉచిత సానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పెద్దగా స్పందించలేదని అడపాదడపా ఇచ్చి చేతులు దులుపు కొనే ప్రయత్నం చేశారని, ఈ తీర్పుతో ప్రభుత్వాలను బాధ్యులను చేయడం హర్షించదగ్గ విషయమని, మధ్యాహ్న భోజన పథకం మరుగుదొడ్ల నిర్మాణం లాంటి పథకాలు కూడా సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా అమలవుతున్నవేనని, ఇప్పుడు ఈ తీర్పు ద్వారా బాలికల డ్రాపౌట్ రేట్, గైర్హాజరు తగ్గే అవకాశాలు ఉన్నాయని టిఎస్ యుటిఎఫ్ పేర్కొంది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును చిత్తశుద్ధితో అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది.






