- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుప్రీంకోర్టు కీలక తీర్పు.. కోవిడ్ టీకా దుష్ప్రభావాలపై 'నో-ఫాల్ట్' పరిహార విధానం
కోవిడ్ టీకా దుష్ప్రభావాల బాధితులకు ఊరట! 'నో-ఫాల్ట్' పరిహార విధానాన్ని రూపొందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశం.

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా యావత్ ప్రపంచ అల్లాడిపోయిన పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కోవిడ్-19 టీకాను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రపంచానికి అండగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ కోవిడ్-19 టీకాను వేయించుకున్న తర్వాత పలువురు తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ.. కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలను జారీ చేసింది. కోవిడ్-19 టీకా కారణంగా తలెత్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ప్రాణనష్టం జరిగిన సందర్భాల్లో బాధితులకు అండగా నిలిచేందుకు 'నో-ఫాల్ట్ కాంపెన్సేషన్' (No-fault compensation) విధానాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. టీకా తీసుకున్న తర్వాత ఇద్దరు మహిళలు మరణించారని, దానికి వ్యాక్సినే కారణమని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, టీకా దుష్ప్రభావాలను పర్యవేక్షించడానికి, శాస్త్రీయంగా విశ్లేషించడానికి ప్రస్తుతం ఉన్న యంత్రాంగమే (AEFI) కొనసాగుతుందని, దీని కోసం ప్రత్యేకంగా కోర్టు తరపున నిపుణుల కమిటీ అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పరిహార విధానాన్ని రూపొందించడం అంటే అది ప్రభుత్వం తన తప్పును ఒప్పుకున్నట్లుగా భావించకూడదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, బాధితులు చట్టపరంగా అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా న్యాయం పొందేందుకు ఈ తీర్పు అడ్డంకి కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.






