- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హేట్ స్పీచ్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
కొద్ది నెలల క్రితం వివిధ పార్టీలకు చెందిన నేతల విద్వేష పూరిత ప్రసంగాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: కొద్ది నెలల క్రితం వివిధ పార్టీలకు చెందిన నేతల విద్వేష పూరిత ప్రసంగాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అలాంటి హెట్ స్పీచ్‌లపై సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. దేశంలో విద్వేష పూరిత ప్రసంగాల (Hate Speech)పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసింది. అలాగే తన నిర్ణయాన్ని రిజర్వ్ ఉంచింది. రాజకీయ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన వివిధ పిటిషన్లను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.
వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదులు
హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు ఇతర పిటిషన్లపై విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు కోర్టు దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ హిందూ దేవతలకు వ్యతిరేకంగా మతపరమైన వ్యాఖ్యలు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోర్టును కోరారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న ఇటువంటి ప్రసంగాలను అడ్డుకోవాలని వారు వాదించారు.
కోర్టు విచారణ - తదుపరి చర్యలు
పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలన్నింటినీ విన్న ధర్మాసనం, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తన తుది తీర్పును వెలువరించనున్న ట్లు ప్రకటించింది. గతంలో కూడా హేట్ స్పీచ్ విషయంలో సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించిన నేపథ్యంలో, ఈ తాజా తీర్పు రాజకీయ నాయకుల ప్రసంగాల నియంత్రణపై ఎలాంటి దిశానిర్దేశం చేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.






