ఆర్ఆర్ఆర్ చిత్రంపై సూపర్ స్టార్ ప్రశంసల జల్లు

by Disha Web Desk 2 |
ఆర్ఆర్ఆర్ చిత్రంపై సూపర్ స్టార్ ప్రశంసల జల్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సునామీ సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతూ సంచలనం క్రియేట్ చేస్తున్నది. బాహుబలి-2 రికార్డులను సైతం ఒక్క దెబ్బతో తిరగరాసిన జక్కన్న మరో చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఇప్పటికే సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి సహా ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. తాజాగా.. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు తన అభిప్రాయన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వరుస ట్వీట్లతో చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ''ఈ భారీ ప్రాజెక్ట్‌ను అమలు చేసినందుకు #RRR మొత్తం టీమ్‌కి హ్యాట్సాఫ్. చాలా గర్వంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు'' అంటూ ట్వీట్ చేశారు.

అంతేగాక, అద్భుతమైన నటనతో ప్రపంచాన్ని తమవైపు తిప్పుకున్న ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపారు. నాటు నాటు సాంగ్ వేరే లెవెల్ అంటూ పొగడ్తల వర్షం కురిపిచారు. దాంతో పాటు రాజమౌళిని మాస్టర్ స్టోరీ టెల్లర్ అంటూ ప్రశంసించారు. మొత్తంగా ట్రిపులార్ సినిమా ఎపిక్ అంటూ చెప్పుకొచ్చాడు. ఊహకు కూడా అందని విధంగా ఈ సినిమా ఉందని.. అద్భుతమైన విజువల్ గ్రాండియర్‌తో పాటు అదిరిపోయే మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అయిందని అభిప్రాయపడ్డారు.

Next Story

Most Viewed