SRH గ్రాండ్ విక్టరీ..ఐపీఎల్ నుంచి లక్నో ఎలిమినేట్

by velandi.Saikiran |   (  Updated:2025-05-19 18:13:40  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో లక్నో జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ దెబ్బకు... ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి

SRH గ్రాండ్ విక్టరీ..ఐపీఎల్ నుంచి లక్నో ఎలిమినేట్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో లక్నో జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ దెబ్బకు... ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది లక్నో. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో లక్నో చేతులెత్తేసింది. 6 వికెట్లతో లక్నోపై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 206 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది హైదరాబాద్.

ఈ మ్యాచ్ లో కేవలం 18.2 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసి విజయం సాధించింది హైదరాబాద్. ఈ నేపథ్యంలోనే లక్నోపై.. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో.. ఐపిఎల్ 2025 ప్లే ఆఫ్ రేసు నుంచి లక్నో తప్పుకుంది. అటు ఈ మ్యాచ్ తో హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు నాలుగు విజయాలను నమోదు చేసుకుంది.

దీంతో కింది నుంచి మూడవ స్థానంలో చోటు సంపాదించుకుంది హైదరాబాద్. అటు లక్నో ఏడో స్థానానికి పరిమితమై ఎలిమినేట్ అయింది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయ్యాయి. మిగిలిన ముంబై ఇండియన్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టలో ఏదో ఒక జట్టు నాలుగవ స్థానాన్ని దక్కించుకుంటుంది. దీనిపై తదుపరి మ్యాచ్ లలో క్లారిటీ వస్తుంది.

Next Story