రేపటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

by Muthe.Rajitha |

తెలంగాణ, ఏపీలోని పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చేశాయి.

రేపటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ, ఏపీలోని పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చేశాయి. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం రేపటి నుంచి ఎండాకాలం సెలవులు మొదలయ్యి, బళ్ళు మూతపడనున్నాయి. ఏప్రిల్ 24 నుండి ప్రారంభం కానున్న ఈ సెలవులు జూన్ 11 వరకు, అంటే దాదాపు 48 రోజుల పాటు కొనసాగనున్నాయి. నేడు పాఠశాలలకు చివరి పని దినం కావడంతో విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అందించనున్నారు. కాగా వేసవి సెలవులు కేవలం ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా, అన్ని ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థలకు కూడా వర్తిస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని చూస్తే ఆయా పాఠశాలల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా పిల్లలు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లకుండా, అలాగే ఈత కోసం బావులు, చెరువుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని అధికారులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

Next Story