- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు..తల్లిదండ్రులకు ప్రభుత్వం కీలక అలర్ట్
by Malleboina Mahesh |
ఏపీలో ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఎండలు మరియు నీటి ప్రమాదాల పట్ల పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం తల్లిదండ్రులకు సూచించింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు (summer holidays) ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం (State Govt) ప్రకటించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియనుండటంతో, తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. తీవ్రమవుతున్న ఎండల దృష్ట్యా తల్లిదండ్రులకు ప్రభుత్వం పలు జాగ్రత్తలు సూచించింది.
ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో పిల్లలను ఎండలోకి పంపవద్దని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. పిల్లలు ఈత కోసం బావులు, చెరువులు, కాలువలు వంటి నీటి ప్రాంతాలకు వెళ్ళకుండా పర్యవేక్షించాలని హెచ్చరించింది. సెలవుల్లో పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది.
Next Story






