Suma kanakala: రాజీవ్ కనకాలతో గొడవలు.. విడాకులపై స్పందించిన సుమ

by samatah |   (  Updated:2022-04-26 07:08:12  IST  )

దిశ, వెబ్‌డెస్క్ : సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Suma kanakala: రాజీవ్ కనకాలతో గొడవలు.. విడాకులపై స్పందించిన సుమ
X

Suma kanakala

దిశ, వెబ్‌డెస్క్ : సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన వాక్ చాతుర్యంతో ఎంతటివారినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. ఇక ఓ పంచాయతీతో సుమ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న జయమ్మ పంచాయతీ సినిమాలో సుమ కనకాల లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న సుమ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.

గత సంవత్సరం రాజీవ్ కనకాల, సుమ విడాకులు తీసుకున్నారని, వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంపై ఆలీ అడిగిన ప్రశ్నకు సుమ స్పందిస్తూ, తన వైవాహిక జీవితంలోని సంఘటనలను షేర్ చేసుకుంది. భార్య భర్తల మధ్య గొడవలు జరగడం కామన్, మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి, ఇక విడాకుల విషయానికి వస్తే.. విడాకులు తీసుకోవడం చాలా ఈజీ. కానీ ఒక తల్లిదండ్రులుగా ఇది చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరు విడిపోదామనుకున్నారు, కానీ పిల్లల గురించి ఆలోచించి కలిసిపోయారని కొందరు ముచ్చటిస్తున్నారు.

Next Story