టీజీజీపీ చైర్మెన్ గా సూదిని రాంరెడ్డి

by Muthe.Rajitha |

తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మెన్ గా సూదిని రాంరెడ్డి, సభ్యులుగా నాగలూరి కృష్ణకుమార్, బాస వేణుగోపాల్ బుధవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు.

టీజీజీపీ చైర్మెన్ గా సూదిని రాంరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మెన్ గా సూదిని రాంరెడ్డి, సభ్యులుగా నాగలూరి కృష్ణకుమార్, బాస వేణుగోపాల్ యాదవ్ ఎర్రమంజిల్ లోని పంచాయతీరాజ్ ఈఎన్సీ ఆఫీసు సమావేశ మందిరంలో బుధవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా చైర్మెన్ సూదిని రాంరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగాను, నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని తెలిపారు. అప్పీల్ లోని కేసుల విచారణ వేగవంతం చేసి చట్టబద్దమైన తీర్పులను వెలువరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, సూదిని పద్మారెడ్డి, సూదిని మనోహర్ రెడ్డి, సూదిని లక్ష్మారెడ్డి, కాయితి సాయిరెడ్డి, ట్రిబ్యునల్ సెక్రటరీ నాగమణి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అధర్ పర్వేజ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Next Story