- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలుషిత నీరు తాగి 38మంది విద్యార్థులకు అస్వస్థత..
by Satheesh |
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం ప్రభుత్వ- latest Telugu news

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో కలుషిత నీరు తాగి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాల ఆవరణలో గల ట్యాంక్‌లోని కలుషిత నీరు తాగిన మొత్తం 134మంది విద్యార్థుల్లో 38 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా వాంతులు చేసుకోగా 15 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కోసం తరలించారు. సమాచారం అందుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా విద్యాశాఖ అధికారి మాధవితో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్యం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Next Story






