- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో శృతిమించితే కఠిన చర్యలు: డీజీపీ శివధర్ రెడ్డి
సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వ్యక్తిత్వ హననం, అసభ్యకర పోస్టులపై డీజీపీ శివధర్ రెడ్డి బుధవారం కీలక ప్రకటన చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వ్యక్తిత్వ హననం, అసభ్యకర పోస్టులపై డీజీపీ శివధర్ రెడ్డి బుధవారం కీలక ప్రకటన చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లడం, కుటుంబ సభ్యులను కించపరచడం చట్టరీత్యా నేరమని ఆయన స్పష్టం చేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే ఆయన ఈ అంశంపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కోన్నారు. వ్యక్తుల క్యారెక్టర్ అసాషినేషన్ (శీలహననం) చేస్తూ పోస్టులు పెట్టే వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా రాజకీయ లేదా ఇతర విభేదాల కోసం ప్రత్యర్థుల కుటుంబ సభ్యులను లక్ష్యం చేసుకోవడం నేరమని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్కులేట్ చేయడం, అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేసే వారిపై నిఘా ఉంచామని ఆయన హెచ్చరించారు. చట్టానికి లోబడి, గౌరవప్రదంగా చేసుకునే విమర్శల పట్ల పోలీసులకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ బహిరంగంగా వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఐటీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎవరి గౌరవానికి భంగం కలగకుండా పోస్టులు చేయాలని డీజీపీ కోరారు.






