మహిళ భద్రత బలోపేతం.. సీఎస్ఆర్ నిధుల వినియోగంపై దృష్టి

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు వుమెన్ సేఫ్టీ వింగ్ మరో ముందడుగు వేసినట్లు ఆ విభాగం ఏడీజీపీ చారు సిన్హా తెలిపారు.

మహిళ భద్రత బలోపేతం.. సీఎస్ఆర్ నిధుల వినియోగంపై దృష్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు వుమెన్ సేఫ్టీ వింగ్ మరో ముందడుగు వేసినట్లు ఆ విభాగం ఏడీజీపీ చారు సిన్హా తెలిపారు. ఆమె నేతృత్వంలో వుమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, దాతృత్వ సంస్థలతో బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

మహిళల భద్రత, స్వేచ్ఛ, న్యాయం, ఆర్థిక సాధికారత వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. మహిళా భద్రతా కార్యక్రమాలను నిర్వహించడంలో సీఎస్ఆర్ నిధుల వినియోగంపై దృష్టి సారించారు. నేరాల నివారణ, బాధితులకు తక్షణ స్పందన, పునరావాసం, సామర్థ్య పెంపు వంటి రంగాల్లో భాగస్వామ్యాల అవసరాన్ని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీపీ వివరించారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించే దిశగా కీలక అడుగు పడినట్లు ఆమె పేర్కొన్నారు.

Next Story