సూర్యాపేట ఓట్ల లెక్కింపులో విచిత్ర సంఘటన.. బ్యాలెట్ బాక్సులో ఓటర్ల విన్నపాలు

by Malleboina Mahesh |

మున్సిపల్ ఓట్ల లెక్కింపు వేళ సూర్యాపేట మున్సిపాలిటీలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతో పాటు జాతీయ రహదారి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని విన్నపించారు.

సూర్యాపేట ఓట్ల లెక్కింపులో విచిత్ర సంఘటన.. బ్యాలెట్ బాక్సులో ఓటర్ల విన్నపాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఓట్ల లెక్కింపు వేళ సూర్యపేట మున్సిపాలిటీ (Suryapet Municipality)లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బ్యాలెట్ బాక్సులో ఓటర్ స్లిప్పులతో పాటు తమ సమస్యలకు సంబంధించిన విన్నపాలును వేశారు. సూర్యాపేట మున్సిపాలిటిలోని 48 వ వార్డులో బాలెట్ పేపర్ తో పాటు చిట్టీలను వేశారు. అందులో జాతీయ రహదారి బాధితులకు నష్ట పరిహారం అందించాలని విన్నపించారు. ఇది చూసిన ఎన్నికల అధికారులు ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఈ విచిత్ర పరిణామం.. మున్సిపల్ ఓట్ల లెక్కింపు వేళ వైరల్ గా మారింది.

Next Story