వింత హోలీ ఆచారం.. చెప్పు దెబ్బలాట!

by Muthe.Rajitha |

యూపీలో చెప్పులతో కొట్టుకునే వింత హోలీ ఆచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వింత హోలీ ఆచారం.. చెప్పు దెబ్బలాట!
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో వెలుగులోకి వచ్చిన వింత హోలీ ఆచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. సాధారణంగా హోలీ అంటే రంగులతో జరుపుకుంటాం, కానీ ఇక్కడ మాత్రం కాస్త వింతగా చెప్పులతో కొట్టుకుంటూ సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ విచిత్రమైన ఆచారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా బచ్చగావ్ గ్రామంలో మాత్రం దశాబ్దాలుగా ఒక వింత హోలీ సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ ప్రజలు రంగులు చల్లుకుంటూనే, ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకుంటూ హోలీ వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు.

ఈ ఆచారం వెనుక ఉన్న నమ్మకం

స్థానికుల కథనం ప్రకారం.. ఇలా ఒకరినొకరు చెప్పులతో కొట్టుకోవడం వల్ల గ్రామంలోని దుష్టశక్తులు నశిస్తాయని వారి నమ్మకం. ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల గ్రామానికి సుఖశాంతులు కలుగుతాయని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని వారు బలంగా విశ్వసిస్తారు. ఈ ఆచారాన్ని ఆ గ్రామస్తులు వీడియో తీసి నెట్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చెప్పు దెబ్బల హోలీ ట్రెండింగ్ గా నిలుస్తోంది. ఇదేం వింత ఆచారం బాబోయ్ అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Next Story