కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు: ఇన్వెస్టర్ల కొంపముంచిన యుద్ధ భయాలు

by Malleboina Mahesh |

అంతర్జాతీయ యుద్ధ భయాలతో కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు. 1352 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 422 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ముగింపు. ఆవిరైన ఇన్వెస్టర్ల సంపద.

కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు: ఇన్వెస్టర్ల కొంపముంచిన యుద్ధ భయాలు
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయ స్టాక్‌మార్కెట్లు మరోసారి భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మదుపర్లు ఆందోళనకు గురై అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 1352 పాయింట్ల నష్టంతో ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 422 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ భారీ పతనంతో కేవలం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరైపోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఐటీ రంగాల షేర్లు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయి.

మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు

ఈ భారీ నష్టాలకు ప్రధానంగా పశ్చిమాసియా (Middle East) లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-ఇజ్రాయెల్ vs ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రం కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు భారీగా పెరిగాయి. చమురు ధరల పెరుగుదల వల్ల భారత్ వంటి దిగుమతి దేశాలపై ద్రవ్యోల్బణం భారం పడుతుందనే భయం మార్కెట్‌ను కుదిపేసింది. దీనికి తోడు రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) పెద్ద ఎత్తున నిధులను వెనక్కి తీసుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

Next Story