వరుసగా రెండో రోజూ.. భారీ లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

by Malleboina Mahesh |

స్టాక్ మార్కెట్లలో బుల్ రన్! 1122 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్, 23,200 దాటిన నిఫ్టీ. క్రూడ్ ధరల తగ్గింపుతో ఇన్వెస్టర్ల కాసుల పంట.

వరుసగా రెండో రోజూ.. భారీ లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్ డెస్క్: రెండు రోజుల క్రితం వరకు భారీ నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు (Stock markets).. మంగళవారం నుంచి భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ కూడా భారీ లాభాలతో (huge profits) దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నివారణకు శాంతి చర్చలు జరుగుతున్నాయనే సానుకూల వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీని ప్రభావంతో సెన్సెక్స్ ఏకంగా 1122 పాయింట్లు లాభపడి 75,190 మార్కును తాకగా, నిఫ్టీ 316 పాయింట్ల వృద్ధితో 23,272 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎనర్జీ రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తుంది.

సెన్సెక్స్ టాప్-30 ఇండెక్స్‌లో ట్రెంట్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు 2 శాతానికి పైగా లాభపడి మార్కెట్ ర్యాలీకి నాయకత్వం వహిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలకు తోడు, దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతు తోడవడంతో మార్కెట్లు సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే సానుకూల ధోరణి కొనసాగితే, రానున్న సెషన్లలో సూచీలు మరిన్ని గరిష్టాలను తాకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story