Kriti Sanon: కాస్మోటిక్స్ సర్జరీలపై స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!!

by Kodari Anjali |   (  Updated:2024-10-26 14:34:17  IST  )

హీరోయిన్ కృతి సనన్ తాజాగా కాస్మోటిక్స్ సర్జరీలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Kriti Sanon: కాస్మోటిక్స్ సర్జరీలపై స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) తాజాగా కాస్మోటిక్స్ సర్జరీ(Cosmetic surgery)లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ అందం కోసం కాస్మోటిక్ సర్జరీ చేసుకోవాలా? లేదా అనే దానిపై మాట్లాడింది. నటీనటులు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడంపై కృతి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆడవారు ఎప్పుడూ కూడా నలుగురిలో అందంగా కనిపించాలనే ఒత్తిడి తీసుకోకూడదని తెలిపింది. అలాగే బ్యూటీగా కనిపించడం కోసం బాడీ పార్ట్స్ సర్జరీ(Body Parts Surgery)లు చేయించుకోవడం అనేది వారి సొంత నిర్ణయమని, అలాంటి వారి విషయంలో నేను ఏం మాట్లాడలేనని పేర్కొంది. సర్జరీలు చేయించుకుంటే అందంగా కనిపిస్తామనుకుంటే ఏమైనా చేసుకోవచ్చు అని వెల్లడించింది. కానీ కొన్నిసార్లు తాము తీసుకున్న నిర్ణయం పలు సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని తెలిపింది. ఈ నటి అందం విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురికానని వెల్లడించింది. మానసికంగా హ్యాపీగా ఉంటే మన ఫేస్ లో అందం కనిపిస్తుందని వివరించింది. కాగా కృతి ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ప్రయత్నించనని.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేస్తానని వెల్లడించింది. అలాగే ఈ నటి తీసుకునే పిక్స్ కు కూడా ఎలాంటి ఫిల్టర్లు(Filters) యూజ్ చేయనని పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Next Story