- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పబ్లిక్ మీటింగ్‌లో విజిల్ వేసి.. సినిమా డైలాగ్ చెప్పిన స్టార్ హీరో
నటుడు, దళపతి విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కజగమ్(టీవీకే) పార్టీకి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: నటుడు, దళపతి విజయ్(Thalapathy Vijay)కు చెందిన తమిళగ వెట్రి కజగమ్(టీవీకే) పార్టీకి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే. ఆదివారం చెన్నైలో పార్టీ ముఖ్య నేతలతో విజయ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈసీ కేటాయించిన విజిల్ గుర్తును అధికారికంగా ఆవిష్కరించారు. అనంతరం మీటింగ్‌లోనే విజల్ వేసి.. ‘కప్పు ముఖ్యం బిగులు’ అనే బిగిల్ సినిమా డైలాగ్ కొట్టారు. దీంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. కాగా, తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 11వ తేదీన తమ పార్టీకి గుర్తు ఇవ్వాలని కోరుతూ విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. 1968 నాటి ఎలక్షన్ సింబల్స్ ప్రచారం తమకు గుర్తు కేటాయించాలని అభ్యర్థించింది. మొత్తం ఏడు సింబల్స్‌కు చెందిన లిస్టును ఆ పార్టీ సబ్మిట్ చేసింది. అయితే ఆ గుర్తులన్నీ ఇప్పటికే ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. స్వంతంగా క్రియేట్ చేసిన మూడు మరో సింబల్స్‌ను కూడా ఆ పార్టీ సమర్పించింది. దీంతో అనూహ్యంగా విజయ్ బిగిల్ సినిమాలో విచ్చలవిడిగా వాడిన, ఆయన అభిమానులకు, పార్టీ శ్రేణులకు ఎంతో సుపరిచితమైన విజిల్ గుర్తు రావడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.






