Shah Rukh Khan: గుడ్ న్యూస్ ప్రకటించిన స్టార్ హీరో.. ఆసక్తికర కామెంట్స్ వైరల్ (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2024-11-04 12:44:36  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan ) సిగరెట్‌కు బానిస అయిన విషయం తెలిసిందే.

Shah Rukh Khan: గుడ్ న్యూస్ ప్రకటించిన స్టార్ హీరో.. ఆసక్తికర కామెంట్స్ వైరల్ (వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan ) సిగరెట్‌కు బానిస అయిన విషయం తెలిసిందే. ఆయన రోజుకు ఒకటిరెండూ ప్యాకెట్లు కాదు ఏకంగా వంద వరకు కాల్చేవాడినని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా షారుఖ్ చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఇక సిగరెట్స్ మానేయమని సలహాలు కూడా ఇచ్చారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, షారుఖ్ ఖాన్ ఓ గుడ్ న్యూస్ ప్రకటించాడు. తన 59వ పుట్టిన రోజు (birthday)సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించగా.. షారుఖ్ పాల్గొని సిగరెట్స్ మానేస్తున్నట్లు తెలిపారు. ‘‘మీకు మంచి విషయం చెప్పబోతున్నాను.

నేను సిగరెట్లు(cigarettes) తాగడం ఆపేశాను. ఇక దాని జోలికి కూడా పోను. కానీ దమ్ము లాగడం ఆపేశాక కూడా శ్వాస సమస్యలు(breathing problems) తగ్గలేదు. ఇప్పటికీ కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నాను. దేవుడి దయ వల్ల త్వరలోనే ఈ ఇబ్బంది కూడా పోయి అంతా బాగుంటుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. ఇక షారుఖ్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది పఠాన్, జవాన్, డుంకీ (Dunki)వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న ఆయన గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చారు.

Next Story