- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PUSHPA-2 : థియేటర్ వద్ద తొక్కిసలాట.. పుష్ప టీంపై కేసు నమోదు
పుష్ప-2(Pushpa-2) సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : పుష్ప-2(Pushpa-2) సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో పుష్ప టీంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పుష్ప-2 ప్రీమియర్ షో కోసం థియేటర్ వద్దకు వస్తున్న అల్లు అర్జున్(Allu Arjun) ను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు తోసుకు రావడంతో భారీ తోపులాట జరిగి ఒక మహిళ మృతి చెందగా.. ఆమె కుమారడు శ్రీతేజ ఆసుపత్రి పాలయ్యాడు. భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ పై, ముందస్తు సమాచారం లేకుండా థియేటర్ వద్దకు చేరుకొని తొక్కిసలాటకు కారణమైన పుష్ప టీంపై సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని పుష్ప సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించారు. శ్రీతేజ ఆసుపత్రి ఖర్చులు భరిస్తామని, రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) హామీ ఇచ్చారు.
Read Aslo..
Rashmika Mandanna:రేవతి మృతి పై స్పందించిన హీరోయిన్ రష్మిక






