- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సారెస్పీ వెల వెల.. రైతన్న విలవిల
ఉత్తర తెలంగాణ వరప్రదాయమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టేవరేజ్ కి చేరువలో ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు డేడ్ స్టోరేజ్ లెవెల్ కు కేవలం 11 టీఎంసీలకు చేరువైంది

దిశ,మెండోరా: ఉత్తర తెలంగాణ వరప్రదాయమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టేవరేజ్ కి చేరువలో ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు డేడ్ స్టోరేజ్ లెవెల్ కు కేవలం 11 టీఎంసీలకు చేరువైంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం, ప్రాజెక్టుకు ఇన్ఫ్లో లేకపోవడం ప్రాజెక్టును డెడ్ స్టోరేజ్ కి చేర్చుతుంది. జూన్ 1న బాబ్లీ గేట్లు ఎత్తితే ఎస్సారెస్పీకి నీళ్లు వస్తాయన్న ఆశ.. చుక్క నీరు రాక,ఆయకట్టు రైతన్నకు ముందస్తు సాగుకు నిరాశే మిగిల్చింది. దీంతో ఆయకట్టు రైతులు, తాగునీటి కోసం ఆధారపడ్డ లక్షలాదిమంది ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం నీటి నిల్వలు..
ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం80.5 టీఎంసీలు (1064అడుగులు )కాగా మంగళవారం నాటికి 15.. 274టీఎంసీల నీరు నిల్వ ఉంది.5.18 టీఎంసీలకు చేరితే డెడ్ స్టోరేజీకి చేరినట్లు లెక్క. కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే ఉందని అధికారుల అంచనా, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 కాగా ప్రస్తుత నీటిమట్టం 1065.20 అడుగులకు పడిపోయింది. గతేడాది ఇదేరోజున 1063.20అడుగులు, 13.8 33టి ఎం సీ ల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు క్యాచ్ మెంట్ ఏరియాలో వర్షాలు లేకపోవడంతో గత కొద్ది కాలంగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో తగ్గిపోయింది. గత సంవత్సరం జూన్ 1 నుండి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 957.193టీ ఎం సీ ల నీరు ఇన్ ఫ్లో రాగ, 953.637టి ఎం సీ ల నీటిని ప్రాజెక్టు నుంచి అవసరాలకు విడుదల చేశారు.
మిషన్ భగీరథ, జగిత్యాల కోరుట్ల మున్సిపాలిటీల తాగునీటి అవసరాల కోసం 61 క్యూసెక్కులు, ఆదిలాబాద్ నిర్మల్ తాగునీటి కోసం 63 క్యూసెక్కులు, ఆర్మూర్ నిజామాబాద్ కామారెడ్డి లకు 108 క్యూసెక్కుల నీరు,మొత్తం 231 క్యూసెక్కుల నీరు, తాగునీటి అవసరాలకు సరిపోవుగా,ఆవిరి రూపంలో 410 క్యూసెక్కుల నీరు, ఆవిరవుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. మొత్తం 941 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి రోజువారీగా ఖాళీ అవుతున్నట్లు అధికారులు అంచనా. కాగా గత ఏడాదితో పోలిస్తే ప్రాజెక్టులో నాలుగు టిఎంసిల నీరు అధికంగానే ఉంది, కానీ ఈ ఏడాది వర్షాలు అధికంగా లేవు అనే వాతావరణ శాఖ అంచనాలతో ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతున్నారు.
ఈసారి కూడా పూడికతీత లేనట్లే..
ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నుండి ఇప్పటివరకు ప్రాజెక్టులో నీటి రాకతో పాటు అనూహ్యంగా బురద వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు గేట్ల వద్ద సుమారు నాలుగు టీఎంసీల వరకు బురద నీరుతో నిండి ఉండటం వల్ల సుమారు నాలుగు టిఎంసిల నీరు విడుదలకు నోచుకోదు అంతేకాకుండా ప్రాజెక్టు సామర్థ్యం కూడా అడుగున బురద చేరడంతో నాలుగు టీఎంసీల వరకు తగ్గినట్లే, దాంతో ప్రాజెక్టులో నాలుగు టీఎంసీల మీద పూడికతీత చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ఈ ఏడాది కూడా పూడికతీత పనులకు నోచుకోలేక పోయింది దీంతో సుమారు నాలుగు టిఎంసిల మేర ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గినట్లే.
తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం..
ప్రాజెక్టును 112 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించగా ప్రస్తుతం 80.5 టీఎంసీలకు పడిపోయింది. గతేడాది 293 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. కానీ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలే ఉండడంతో వందల టీఎంసీల నీరు గోదావరి పాలైంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గకుంటే, నీరు నిల్వ ఎక్కువగా ఉండేది.
జూలై తర్వాతే వరదలు..
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఎప్పుడు కూడా జూలై తర్వాతనే వరదలు వచ్చి చేరుతుండడంతో కాలువల ద్వారా నీటి విడుదల ఆగస్టులో చేపడుతున్నారు. దీంతో పంటల సాగు ఆలస్యమవుతుంది. ప్రస్తుత సంవత్సరం కూడా ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి చుక్క నీరు వచ్చి చేరలేదు. ఎగువ ప్రాంతాల్లో గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రతి ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు వర్షాకాలంలో 4 నెలలపాటు 14 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తారు. గేట్ల ఎత్తివేతను పర్యవేక్షించడానికి కేంద్ర జల సంఘం సభ్యులు, మరియు ఇరు ప్రాజెక్టుల అధికారులు పాల్గొని బాబ్లీ గేట్లను ఎత్తి వేస్తారు. ఈ సమయంలో వచ్చే నీళ్లే ప్రాజెక్టుకు ప్రధాన ఆధారం. ప్రస్తుత సంవత్సరం కూడా వరదలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయకట్టు రైతులు ముందస్తుగా సాగుపై పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి.
రుతుపవనాల పై అన్నదాత ఆశలు..
గత ఏడాది ప్రాజెక్టులోకి జూలై --అక్టోబర్ నెలల్లో బాబ్లీ గేట్ల ద్వారా 32 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అయితే ఈసారి ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా ఐన మహారాష్ట్రలోని నాందేడ్, పర్బాని జిల్లాలలో ఇప్పటివరకు వర్షం ఊసే లేదు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ రెండో వారం నుంచి రుతుపవనాలు చురుగ్గా మారితే వర్షాలు కురిసి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
సాగు, తాగునీటి పై ప్రభావం..
ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఆయకట్టులో నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, నల్గొండ వరంగల్, జిల్లాలలో ఆరు లక్షల ఎకరాల్లో సాగు కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న నీరు మిషన్ భగీరథ ద్వారా 15 లక్షల మందికి తాగునీరు అందించడానికి సరిపోతుంది. ఒకవేళ ఇన్ఫ్లో రాకపోతే ఆయకట్టు సాగుకు నిర్బంధించడం కష్టమవుతుంది. బాబ్లీ గేట్లు తెరిచినప్పటికీ బాబ్లీ ప్రాజెక్టులో నీరు లేక పోయిన, ప్రాజెక్టు క్యాచ్ మెంట్ ఏరియాలో వర్షాలు పడకపోయిన ప్రయోజనం ఉండదు.
కనిపించని కాళేశ్వరం నీళ్లు..
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి సకాలంలో వరదలు రాణి సమయంలో కాలేశ్వరం నుంచి నీటిని వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా ప్రాజెక్టుకు తరలించేలా ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పనులు 2017 లో ప్రారంభించారు. 2023లో ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని ప్రారంభించారు. కానీ కేవలం ప్రాజెక్టులోకి 2.5 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. అప్పటి నుంచి కాళేశ్వరం నీటి కథ కంచికే చేరింది. దీంతో ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర ప్రాంతంలో ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా కురిసే వర్షాల పైనే ఆధారపడి నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.
ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్...
మరోపక్క ఎస్సారెస్పీ ఆయకట్టులో నిజామాబాద్, నిర్మల్, రైతాంగం ఖరీఫ్ సీజన్లో ముందస్తుగానే వాణిజ్య పంటలైన పసుపు మొక్కజొన్న పంటలు సాగు చేస్తారు. ఖరీఫ్ సాగుకు కాకతీయ కాలువ ద్వారా, సరస్వతి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు..
సాగుకు లీకేజి నీళ్లు విడుదల చేయాలి: నర్సయ్య తొర్తి రైతు
ఆరు ఎకరాల్లో మొక్కజొన్న, పసుపు సాగు చేద్దాం అన్ని దుక్కి చేశాను. వర్షాలు లేటుగా వస్తున్నందున కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే ముందస్తు సాగు చేయడానికి వీలవుతుందని తెలిపారు.






